మల్లీ వాయిదా పడిన రాజ్యసభ

SMTV Desk 2018-12-20 14:20:38  Parliment, Venkaiah nayudu, Postponed

న్యూ ఢిల్లీ, డిసెంబర్ 20: పార్లమెంట్ సమావేశాలు తాజాగా సభ ప్రారంభమైన రోజు నుండి ఎటువంటి కార్యకలాపాలు లేకుండా వాయిదా పడుతూ వస్తుంది. ఈరోజు కుడా రాజ్యసభ రేపటికి వాయిదా పడింది. మంగళవారం రాజ్యసభలో కాంగ్రెస్‌ సీనియర్‌ నేత ఆనంద్‌ శర్మ, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి విజ§్‌ు గోయల్‌ తలెత్తిన వాదన గురించి ఛైర్మన వెంకయ్య ఈరోజు ప్రస్తామించారు. రికార్డులను పరిశీలించానని, అందులో ఎక్కడా విజయ గోయల్‌ రాహుల్‌ పేరును ప్రస్తావించలేదని వెంకయ్య తెలిపారు. దీనిపై ఆనంద్‌ శర్మ మాట్లాడుతు చాలా మంది సభ్యులు రాహుల్‌ పేరుతో ప్లకార్డులు ప్రదర్శిస్తూ.. ఆయన పేరును ప్రస్తావించారని అన్నారు. నినాదాలు రికార్డుల కింద పరిగణించలేమని వెంకయ్య స్పష్టం చేశారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్‌ ఎంపీలు ప్రత్యేక హోదా డిమాండ్‌ చేస్తూ.. తమిళనాడు ఎంపీలు కావేరీ జల వివాదంపై చర్చ కోసం ప్లకార్డులు పట్టుకొని వెల్‌లోకి దూసుకొచ్చారు.

ఈ క్రమంలో వెంకయ్య స్పందిస్తూ.. దేశ ప్రజలంతా మనల్ని గమనిస్తున్నారు. చర్చించాల్సిన అంశాలు చాలా ఉన్నాయి. ముఖ్యమైన బిల్లులు ఆమోదించాల్సి ఉంది. రఫేల్‌, తుపానులు, వ్యవసాయ సంక్షోభం వంటి ముఖ్యమైన అంశాలపై చర్చించాల్సి ఉంది అని సభ్యులపై అసహనం వ్యక్తం చేశారు. అయినా ఎంపీలు వినకపోవడంతో రాజ్యసభను శుక్రవారానికి వాయిదా వేశారు.