ముగిసిన కేసీఆర్ ఢిల్లీ పర్యటన

SMTV Desk 2017-07-26 17:58:07  CM kcr, modi, KCR tour of Delhi

న్యూ ఢిల్లీ, జూలై 26 : సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటన ముగిసింది.ఈ పర్యటనలో భాగంగా రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై ఆయన చర్చించారు. ఈ భేటీ అనంతరం కేసీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. రైతుల సమస్యలు, రక్షణ భూములలో వంతెనల నిర్మాణం, బైసన్‌ పోలో గ్రౌండ్స్‌, ముస్లిం రిజర్వేషన్లు, వెనుకబడిన ప్రాంతాలకు నిధులతో పాటు ఆరు అంశాలను ప్రధాని దృష్టికి తీసుకెళ్లానని తెలిపారు. అంతేకాకుండా ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సుకు ప్రధానిని ఆహ్వానించానని, అసెంబ్లీ సీట్ల పెంపు అంశం తమకు ప్రాధాన్యం కాదంటూనే ప్రధానంగా చర్చించినట్టు తెలిపారు.