'కాంచన 3' వచ్చేస్తుంది

SMTV Desk 2018-12-20 12:32:34  kanchana,lawrence,raghava,petta,rajini kanth

హైదరాబాద్, డిసెంబర్ 18 : రాఘవ లారెన్స్ కి మంచి డాన్సర్ గా , నటుడిగా , దర్శకునిగా తెలుగు .. తమిళ భాషల్లో మంచి గుర్తింపు వుంది. ఆయన దర్శకత్వంలో వచ్చిన కాంచన గంగ(కాంచనా 2) సినిమాలు ఘన విజయాలను అందుకున్నాయి. హారర్ కామెడీ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలు రెండు భాషల్లోను భారీ వసూళ్లను రాబట్టాయి. అంతే కాకుండా ఈ సినిమాలు టీవీలో కూడా మంచి రేటింగ్స్ ను రాబడుతున్నాయి. ఈ నేపథ్యంలో లారెన్స్ కాంచన 3 కి ప్లాన్ చేశాడు.

తమన్ సంగీతాన్ని సమకూర్చుతోన్న ఈ సినిమాలో లారెన్స్ సరసన కథనాయికలుగా ఓవియా .. వేదిక నటిస్తున్నారు.సన్ పిక్చర్స్ వారితో కలిసి ఆయన ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఏప్రిల్ 18వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నట్టు అధికారికంగా ప్రకటించారు. రజనీకాంత్ పెట్టా సినిమా ఇంటర్వెల్ సమయంలో కాంచన 3 మోషన్ పోస్టర్ ప్రదర్శితమయ్యేలా ప్లాన్ చేస్తున్నారు. మొత్తానికి లారెన్స్ మరోమారు భయపెట్టడానికి , నవించడానికి రెడీ అవుతున్నాడన్న మాట.