'యన్.టి.ఆర్' తో 'కె.టి.ఆర్'

SMTV Desk 2018-12-20 12:14:17  ntr,young tiger,ktr,trs,suhasini

హైదరాబాద్ , డిసెంబర్ 20 :యంగ్ టైగర్ యన్ .టి . ఆర్, దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వం లో రాంచరణ్ తో కలిసి నటిస్తున్న చిత్రం ఆర్ఆర్ఆర్ ఈ సినిమా షూటింగ్ లో ఉన్నాడు . కూకట్ పల్లి నుంచి తన సోదరి నందమూరి సుహాసిని ఎన్నికల బరిలోకి దిగినా ప్రచారానికి దూరంగానే ఉన్నాడు. మరోవైపు, ఎన్నికల్లో గెలిచి టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో కలసి తారక్ దిగిన ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓ ప్రైవేట్ పార్టీలో ఇద్దరూ కలసినట్టు తెలుస్తోంది. అయితే, ఈ కలయిక ఎప్పుడు, ఎక్కడ జరిగిందనే వివరాలు మాత్రం తెలియరాలేదు.