ఆకట్టుకుంటున్న చిన్న సినిమా మోషన్ పోస్టర్

SMTV Desk 2018-12-20 11:56:26  ,indraja , vinod kumar ,akkadokaduntadu, Siva Kantamaneni, Ravi Babu, Vinod Kumar, Indhraja, Ram Karthik, Siva Harish, Rasgnya Deepika, Alekya

హైదరాబాద్, డిసెంబర్ 18 : సినిమాలలో విషయం ఉంటే చిన్న సినిమాకయినా పెద్ద విజయం కట్టబెడతారు మన తెలుగు సినీ ప్రేక్షకజనం. ఇటీవల విడుదలయిన " అక్కడొకడుంటాడు " అనే చిన్న సినిమా మోషన్ పోస్టర్ ఆకట్టుకుంటుంది . "అక్కడొకడుంటాడు లెక్కగడుతుంటాడు కదిలిచూడు కాల యడుముడిగా వేటాడగా " అని వచ్చే నేపధ్య గీతం అధనపు ఆకర్షణ గా ఉంది . కొత్త తారాగణం తో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని , కొత్త దర్శకుడు శ్రీ పాద విశ్వక్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని లైట్ హౌస్ సినీ మ్యాజిక్ బ్యానర్ పై కె . శివ శంకర్ రావు , రావుల వెంకటేశ్వర రావు నిర్మాతలగా వ్యవహరిస్తున్నారు . కొత్త నటి నటుల్ని ప్రోత్సహించే రవి బాబు, పాత తరం నటులు ఇంద్రజా , వినోద్ కుమార్ కూడా ఈ చిత్రం లో నటిస్తున్నారు .