దేవాలయాల అభివృద్ధిపై దృష్టి పెట్టిన రాహుల్

SMTV Desk 2018-12-20 11:50:25  Rahul gandhi, Congress party, Temples devolopment

అమేథీ, డిసెంబర్ 20: ఈ మధ్య జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మూడు రాష్ట్రాల్లో విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే రైతు రుణ మాఫీ లపై ద్రుష్టి సారించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా దేవాలయాలపై కూడా తన చూపు తిప్పాడు. తన సొంత నియోజకవర్గమైన అమేథీలోని 13 పురాతన దేవాలయాల అభివృద్ధికి ఎంపీల్యాడ్స్ నిధులు కేటాయించారు. మూడు రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారం సందర్భంగా రాహుల్ గాంధీ దేవాలయాలను సందర్శించి పూజలు చేసిన అనంతరం విజయం సాధించారు. అమేథీలోని పురాతన దేవాలయాలైన కాళికన్‌దేవి, దుర్గా దేవాలయం (గౌరీగంజ్), భవానీ దేవాలయాలతో (షాఘర్) పాటు 13 ప్రాంతాల్లో రాహుల్ గాంధీ హైమాస్ట్ సోలార్ దీపాలు ఏర్పాటు చేయించారని కాంగ్రెస్ నాయకుడు అనిల్ సింగ్ వెల్లడించారు. దేవాలయాల సుందరీకరణతోపాటు వాటికి వాయిద్యపరికరాలైన హార్మోనియం, ధోలక్, మంజీరాలను అందజేశారు. అమేథీ దేవాలయాల్లో రాహుల్ మంచినీటి సౌకర్యాలు కల్పించారని మరో కాంగ్రెస్ స్థానిక నాయకుడు చంద్రకాంత్ దూబే చెప్పారు. కాగా 2019 పార్లమెంట్ ఎన్నికల్లో విజయం సాధించడం కోసమే రాహుల్ దేవాలయాల బాట పట్టారని బీజేపీ అమేథీ జిల్లా అధ్యక్షుడు ఉమాశంకర్ పాండే ఆరోపించారు