భారతీయులకు అమెరికా నుండి పిలుపు

SMTV Desk 2018-12-20 11:01:03  America, India, Indian people, America visa

అమెరికా, డిసెంబర్ 20: ప్రపంచ అగ్ర దేశమైన అమెరికా భారతీయ నిపుణులను ఆహ్వానిస్తుంది. ఓవైపు అమెరికాలో ఉన్న భారతీయ వృత్తి నిపుణులకు వీసా నిబంధనల్లో కఠినంగా వ్యవహరిస్తూ భారతీయులని దేశం విడిచిపెట్టేలా చేసిన కొన్ని పరిణామాలు మనకు తెలిసినవే. అయితే తాజాగా ఈయూలోని 27 దేశాలతో సమానంగా భారతీయ నిపుణులకూ వీసాలు జారీ చేయాలనే నిర్ణయానికి వచ్చింది. ఇది చాలా శుభపరిణామం అంటున్నారు. ఇక బ్రెగ్జిట్ ఖరారు కావడంతో వలస వ్యవస్థలో సమూల మార్పులు తీసుకురావాలనే నిర్ణయానికి వచ్చింది బ్రిటన్... దీనిలో భాగంగా అత్యంత నిపుణులైన వారి వలసలపై ఇప్పటి వరకు ఉన్న పరిమితిని ఎత్తివేయనుంది. దీంతో ఇప్పటి వరకు ఏడాదికి 20,700 వర్క్ వీసాలు మాత్రమే జారీ చేయాలనే నిబంధన ఎత్తివేయనున్నారు. ఇదే జరిగితే భారతీయ వృత్తి నిపుణులకు లబ్ధి చేకూరుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇది బ్రిటన్‌ ఇమ్మిగ్రేషన్ వ్యవస్థలో 40 ఏళ్లలో అతిపెద్ద మార్పుగా చెబుతున్నారు