కేంద్రమంత్రులని కలిసిన తెరాస ఎంపీలు

SMTV Desk 2018-12-19 20:11:35  TRS, MP, Central ministers

న్యూ ఢిల్లీ, డిసెంబర్ 19: ఈ రోజు తెరాస ఎంపీలు వివిధ శాఖ కేంద్రమంత్రులను కలిసి కేంద్రం నుంచి తెలంగాణకు న్యాయంగా రావాల్సిన నిధులు, అనుమతుల కోసం పలువురు కేంద్రమంత్రులకు వినతి పత్రాలు అందజేశారు. హైకోర్టు విభజన సహా ఇతర విభజన హామీలను టీఆర్ఎస్ ఎంపీలు కేంద్రమంత్రుల దృష్టికి తీసుకెళ్లారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు కేంద్రం నుంచి తెలంగాణకు రావాల్సిన నిధులు, అనుమతుల కోసం పోరాటం కొనసాగిస్తామని టీఆర్‌ఎస్ లోక్‌సభా పక్ష నేత జితేందర్ రెడ్డి చెప్పారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణపై చిన్నచూపు చూస్తోందని.. అయినా రాష్ట్రానికి రావాల్సిన అనుమతులు, వాటాలను పోరాడి సాధించుకుంటామన్నారు. అన్ని రాష్ట్రాలకు వచ్చే నిధులే తెలంగాణకు ఇచ్చారని..అదనంగా వొక్క పైసా కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. విభజన హామీల అమలు విషయంలో మోదీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. ఎంపీ వినోద్ కుమార్ మాట్లాడుతూ..ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో తెలంగాణ కోసం గత నాలుగున్నరేళ్లుగా ఢిల్లీలో పోరాడి ఎన్నో సాధించుకున్నట్లు చెప్పారు.