ఆప్త నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన నటరాజు యిల్లూరి

SMTV Desk 2018-12-19 20:06:56  American progressive telugu assosiation, Elections, Nataraju illuri

అమెరికా, డిసెంబర్ 19 : 2019-20 అమెరికన్ ప్రోగ్రెసివ్ తెలుగు అసోసియేషన్ (ఆప్త) నూతన కార్యవర్గం ఎన్నికల్లో నూతన అధ్యక్షుడిగా నటరాజు యిల్లూరి ఎన్నికయ్యారు. ఈ ఎన్నికల్లో అధ్యక్షుడితో పాటు నూతన కార్యవర్గ సభ్యులను ఎన్నుకున్నారు. అమెరికాలోని తెలుగువారి కోసం 2008లో ప్రారంభమైన ఈ సంస్థ గత పదేళ్లుగా పలు స్వచ్చంద సేవాకార్యక్రమాలను నిర్వహిస్తోంది. అమెరికాలోని తెలుగు రాష్ట్రాల విద్యార్థులు, యువత, ఉద్యోగులు ఎదుర్కునే ఇబ్బందులను పరిష్కరించేందుకు సంస్థ తమవంతు సహకారాన్ని అందిస్తోంది. సేవాకార్యక్రమాలతో పాటు తెలుగు సంస్కృతి, సాంప్రదాయాలను, సాంస్కృతిక కళల వారసత్వాన్ని పరిరక్షించేందుకు ఏటా సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తూ.. తెలుగువారందరిలో ఐకమత్య భావన కోసం కృషిచేస్తోంది. 2008లో ప్రారంభమైన ఆప్త సంస్థలో ప్రస్తుతం ఐదు వేల మంది సభ్యులు ఉన్నారు. నటరాజు యిల్లూరి ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఆవిర్భావం నుంచి సంస్థ ఎదుగుదలకు కృషిచేసిన పూర్వ కార్యవర్గ సభ్యులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు.

కొత్తగా ఎన్నిక కాబడిన కార్యవర్గ సభ్యులతో కలిసి ఆప్త సంస్థ ఎదుగుదలకు మరింత కృషి చేస్తానని తెలియజేశారు. ఆప్త నూతన కార్యవర్గం.. ఆప్త నూతన కార్యవర్గంలో కోర్ ఎగ్జిక్యూటివ్ సభ్యులుగా నటరాజు యిల్లూరి, బనారసిబాబు, ఎనుముల ఇన్నయ్య, శివ మొలబంటి, డా.నీరజా నాయుడు చవకులు, శ్రీకాంత మెన్నం, లక్ష్మి చింతల, రావూరి సుభాషిణి, కోడె సురేష్, డా.గోపాల్ సిరిసాని, తోట వీరా, మదన్ మోహన్ బోనేపల్లి ఎంపికయ్యారు. వీరితో పాటు బోర్డు ఆఫ్ డైరెక్టర్స్ గా కిరణ్ పల్లా, అరుణ దాసరి, శ్రీధర్ నిస్సంకరరావు, రే దీప్తి నాయుడు, మహేష్ కర్రి, శ్రీధర్ వెన్నం రెడ్డి, గోన సురేష్, శ్రీనివాస్ సిద్దినేని, డా.సురేష్ అలహరి, దుర్గా ప్రసాద్ పెద్దిరెడ్డి ఎన్నికయ్యారు.