2019ఐపీఎల్ సీజన్ లో సన్‌రైజర్స్ టీం

SMTV Desk 2018-12-19 20:04:43  2019 IPL, Cricket players Selections, Sun risers hyderabad

జైపూర్, డిసెంబర్ 19: 2019 ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) సీజన్ నిన్న జైపూర్ వేదికగా జరిగిన వేలంలో సన్‌రైజర్స్ యాజమాన్యం జట్టుకు కావాల్సిన ఆటగాళ్లను మాత్రమే తీసుకొని మరింత పటిష్టం చేసింది. ధావన్, అలెక్స్ హేల్స్, క్రిస్ జోర్డన్‌లను వదులుకున్న సన్‌రైజర్స్.. నిన్నటి వేలంలో మార్టిన్ గప్తిల్‌ను, వృద్ధిమాన్ సాహా, జానీ బెయిర్‌ స్టోను సొంతం చేసుకుంది. గప్తిల్‌ ఓపెనర్‌గా.. వృద్ధిమాన్ సాహా, జానీ బెయిర్‌ స్టోలు వికెట్ కీపర్ గా జట్టుకు సేవలందించనున్నారు. ఇక షాబాజ్ నదీమ్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు నుంచి ట్రేడింగ్ ద్వారా తీసుకుంది. డేవిడ్ వార్నర్ కూడా రీ ఎంట్రీ ఇవ్వబోతుండటంతో జట్టు బ్యాటింగ్, బౌలింగ్ లలో సమతూకంగా ఉంది.
బ్యాటింగ్ లో డేవిడ్ వార్నర్, మార్టిన్, విలియమ్‌సన్, మనీష్ పాండే, యూసఫ్ పఠాన్, వృద్ధిమాన్ సాహా, జానీ బెయిర్ స్టో, సకీబ్ అల్ హసన్, దీపక్ హుడాలతో బలంగా ఉంది. ఇక బౌలింగ్ లో భువనేశ్వర్ కుమార్, బిల్లీ స్టాన్‌లేక్, సిద్ధార్థ్ కౌల్, సందీప్ శర్మ, రషీద్ ఖాన్, షాబాజ్ నదీమ్ లు ఉన్నారు. ఆల్‌రౌండర్లు సకీబ్ అల్ హసన్, యూసఫ్ పఠాన్, విజయ్ శంకర్ లు కూడా జట్టును ఆదుకునేందుకు ఉన్నారు. మొత్తంగా బ్యాట్స్‌మెన్, బౌలింగ్, ఆల్‌రౌండర్లలతో సన్‌రైజర్స్ హైదరాబాద్ పటిష్టంగా ఉంది.

సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు:

డేవిడ్ వార్నర్ (కెప్టెన్), కేన్ విలియమ్‌సన్ (వైస్ కెప్టెన్), మనీష్ పాండే, భువనేశ్వర్ కుమార్, సిద్ధార్థ్ కౌల్, సందీప్ శర్మ, రషీద్ ఖాన్, మహ్మద్ నబీ, యూసఫ్ పఠాన్, విజయ్ శంకర్, బిల్లీ స్టాన్‌లేక్, బసిల్ తంపి, దీపక్ హుడా, సకీబ్ అల్ హసన్, అభిషేక్ శర్మ, శ్రీ వాత్సవ్ గోస్వామి, త్యాగరాజ్ నటరాజన్, రికీ భుయి, మార్టిన్ గప్తిల్, జానీ బెయిర్ స్టో (వికెట్ కీపర్), వృద్ధిమాన్ సాహా (వికెట్ కీపర్), షాబాజ్ నదీమ్.