రాజమహేంద్రవరం పార్లమెంట్ స్థానంపై ఉత్కంఠత.!

SMTV Desk 2018-12-19 18:15:20  YCP, Jaganmohan Reddy, TDP, Murali Mohan, Rajamandri MP Seat

రాజమండ్రి, డిసెంబర్ 19: ఆంధ్రప్రదేశ్ లో రానున్న ఎన్నికల్లో రాజమహేంద్రవరం పార్లమెంట్ స్థానంపై పోటీ రసవత్తరంగా మారనుంది. ఆ స్థానం నుంచి ఎవరెవరు పోటీ చేస్తున్నారనే విషయంపై ప్రస్తుతం చర్చానీయాంశం అయింది. రాజమహేంద్రవరం పార్లమెంట్ స్థానం నుంచి టీడీపీ అభ్యర్థి నేనే అంటూ.. ప్రస్తుత ఎంపీ నటుడు మురళీ మోహన్ ఇప్పటికే ప్రచారం చేసుకుంటున్నారు.

చిత్రరంగం నుంచి రాజకీయాల్లోకి అడుగుపెట్టిన మురళీ మోహన్ 2009లో ఓటమి చవిచూశారు. 2014 ఎన్నికల్లో మురళీమోహన్ అత్యధిక మెజారిటీతో గెలుపొందారు. ఎంపీగా ఈ అయిదేళ్లలో చేపట్టిన అభివృద్ధే తనను మళ్లీ గెలిపిస్తుందని ఆయన ధీమాతో ఉన్నారు. కాగా మురళీ మోహన్ కి పోటీగా.. వైసీపీ నుంచి ఓయ్ నిన్నే సినిమా హీరో( మార్గాని భరత్)ని రంగంలోకి దింపాలని జగన్ ప్లాన్ చేశారు. మార్గాని భరత్ ని రాజమహేంద్రవరం పార్లమెంట్ అభ్యర్థిగా ప్రకటించారు. బీసీ సామాజికవర్గానికి చెందిన వ్యక్తి అని సమాచారం. అయితే జనసేన పార్టీ నుంచి రాజమండ్రి అర్బన్ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ బీజేపీ ని వీడి జనసేన తరపున ఎంపీగా బరిలోకి దిగే అవకాశం ఉంది.