కాశ్మీర్ లో పాతాళానికి పడిపోయిన ఉష్ణోగ్రతలు

SMTV Desk 2018-12-19 14:38:25  Jammu kashmir, Weather report

జమ్ముకాశ్మీర్‌, డిసెంబర్ 19: నగరంలోని లడక్ ప్రాంతంలో ఉష్ణోగ్రత మైనస్‌ 15.8 డిగ్రీలకు పడపోయింది. మంగళవారం భారత వాతావరణశాఖ దేశంలో అత్యల్ప ఉష్ణోగ్రతలు జమ్ముకాశ్మీర్‌లోని కార్గిల్‌ప్రాంతంలోనే ఉన్నట్లు వెల్లడించింది. కాశ్మీర్‌లోయలోను, లడక్‌ప్రాంతంలోను అత్యంత చలి నమోదయిందని వెల్లడించారు. లేహ్‌ప్రాంతంలో మైనస్‌ 15.1 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు పడిపోయాయి. శ్రీనగర్‌లో రాత్రిపూట ఉష్ణోగ్రతలు మైనస్‌ 4.6డిగ్రీల సెల్సియస్‌గా నమోదయ్యాయి. క్వాజిగండ్‌ ప్రాంతంలో మైనస్‌ 5.3డిగ్రీలుగాను, కోకర్నాగ్‌ప్రాంతంలో మైనస్‌ 4.8 డిగ్రీలు, కుప్వారాలో మైనస్‌ 5.9 డిగ్రీలు పహల్‌గామ్‌వద్ద మైనస్‌ 7.7 డిగ్రీల సెల్షియస్‌ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గుల్‌మార్గ్‌లోని స్కీరిసార్టుల్లో అత్యధిక కనిష్టంగా ఉష్ణోగ్రతలున్నాయి. మైనస్‌ 7.6 డిగ్రీలునమోదుకావడంతో మొత్తం చలి కమ్ముకుని జనజీవనాన్ని అతలాకుతలంచేసింది. వొకమోస్తరు ఉష్ణోగ్రతలుమాత్రమే ఉంటాయని, మరికొంతకాలం ఈ చలిపులి కొనసాగుతుందని వాతావరణశాఖ వెల్లడించింది. జమ్ములో రాత్రిపూట వాతావరణం కొంతమెరుగుపడింది. గతవారం పూర్తిగా కనిష్టస్థాయికిచేరింది.

జమ్మునగరంలో 0.7డిగ్రీల ఉష్ణోగ్రత రాత్రిపూట నమోదయింది. రానురాను క్రమేపీ 5.1 డిగ్రీలకు మెరుగుపడింది. సాధారణ వర్షపాతంస్థాయికంటే అత్యంత కనిష్టస్థాయికి వర్షపాతం పడిపోయింది. ధోడా జిల్లాలోని భదర్‌వామ్‌ ప్రాంతంలో 0.6డిగ్రీల ఉష్ణోగ్రత ఉంది. రాత్రిపైట మైనస్‌ 1.2డిగ్రీలుగా ఉంటున్నది. కాట్రాప్రాంతంలో వైష్ణోదేవి మందిరానికి వెళ్లే యాత్రికుల శిబిరం వద్ద 6.5 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదయింది. ఇక జమ్ముశ్రీనగర్‌ జాతీయ రహదారి వెంబడి ఉన్న బటోట్‌ పట్టణంలోరాత్రిపూట ఉష్ణోగ్రతలు కేవలం 3.6 డిగ్రీల సెల్షియస్‌మాత్రమే ఉంది. సమీపంలోని హైవేపట్టణం బనిహాల్‌వద్ద రాత్రిపైట 0.7 డిగ్రీల కనిష్టానికి పడిపోయింది.