తెరాస పార్టీ, ప్రభుత్వంలో హరీష్ రావ్ నెక్స్ట్ రోల్...?

SMTV Desk 2018-12-19 14:33:54  TRS, Harish rao, KTR, KCR, Telangana upcomming CM

హైదరాబాద్, డిసెంబర్ 19: తెరాస పార్టీ లో కెసిఆర్ తర్వాత నాయకుడు ఎవరు అంటే వెంటనే గుర్తొచ్చే పేరు హరీష్ రావ్. తెరాస పార్టీ లో హరీష్ రావు కి సరైన ప్రాధాన్యం ఇస్తున్నారా...? అనేది ఇపుడు ప్రశ్నగా మారింది. ఎందుకంటే తెరాస పార్టీ 2001 లో మొదలు పెట్టినప్పటి నుండి కెసిఆర్ వెన్నంటే వుండి అన్ని విధాలా సహకరించిన వ్యక్తి హరీష్ రావే. కానీ ఇపుడు అదే హరీష్ రావ్ ని పక్కన పెడుతున్నట్లు పలు వర్ఘాలు చర్చించుకుంటున్నాయి. మొన్న జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో చాల చోట్ల హరీష్ రావు వర్గీయులకు సీట్లు ఇవ్వలేదు అన్నది అందరికి తెలిసిందే. కొండా సురేఖ కూడా పార్టీ మారుతూ మీడియా ముందు కెసిఆర్ గారు హరీష్ రావు వర్గానికి టిక్కెట్టులు ఇవ్వలేదు అని అన్యాయం చేస్తున్నారు అని చెప్పింది. ఈ రెండు మూడు రోజులు జరిగిన ఏవైతే పరిణామాలు ఉన్నాయో అవి కూడా హరీష్ రావ్ కి పక్కన పెట్టె విషయమై దోహద పడుతున్నాయి. ఇన్ని రోజులు కెసిఆర్ వెన్నంటే వుండి పార్టీ కోసం తెలంగాణ కోసం కష్టపడ్డ హరీష్ రావ్ ని కాకుండా కొడుకు అయినా సిరిసిల్ల నియోజక వర్ఘం నుండి 2009 ఎలక్షన్ లో మొదటి సారి గెలిచి, ఇప్పటి వరకు వివిధ మంత్రిత్వశాఖలో పని చేసిన కేటీర్ కు తెరాస పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిని కట్టబెట్టారు. మరి ఇందులో మతలబు ఏంటో కెసిఆరే చెప్పాలి ఇక్కడ ఇంకో విషయం ఏంటి అంటే తెరాస పార్టీ సంబందించిన ఏ కార్యక్రమాలలో అయినా ఈ మధ్య హరీష్ రావు కనపడడం తగ్గింది మరి ఇది దేనికి సంకేతం? అని ప్రముఖ పార్టీ నేతలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

రెండు రోజుల క్రితం కాళేశ్వరం ప్రాజెక్ట్ అయితేనేమి మిషన్ భగీరథకి సంబందించిన మీటింగ్ లో ఎక్కడ కూడా హరీష్ రావ్ కనపడలేదు అసలు ఈ ప్రాజెక్టులు యుద్ధ ప్రాతిపదికన పనులు జరుగుతన్నాయంటే దీనికి కారణమే హరీష్ రావ్ 2014 లో మొదటిసారి తెలంగాణాలో తెరాస ప్రభుత్వం ఏర్పడ్డాక భారీ నీటిపారుదల శాఖ మంత్రిగ పనిచేసారు. మరి ఈయన్ని పక్కన పెట్టి సీఎం కెసిఆర్ మీటింగ్ పెట్టడంలో ఆంతర్యం ఏంటి?

కొడుకు కేటీర్ కోసం ఇన్ని రోజులు వెన్నంటే వున్న హరీష్ రావ్ ని పక్కన పెట్టి సీఎం కుర్చీలో కొడుకుని కుర్చోపెట్టాలి అని సీఎం కెసిఆర్ గారి అంతర్యం అని పలు పార్టీ వర్ఘాలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరి తెరాసలో, ప్రభుత్వంలో హరీష్ రావ్ నెక్స్ట్ రోల్ ఏంటో?