'అన్ని రంగాల్లో స్త్రీలకు సమాన అవకాశం' ఇదేనా...?

SMTV Desk 2018-12-19 14:32:00  World economic forum, Gender baise, 108th place

న్యూ ఢిల్లీ, డిసెంబర్ 19: డబ్ల్యూఈఎఫ్‌ తాజాగా విడుదల చేసిన అంతర్జాతీయ లింగ వ్యత్యాస సూచీలో భారత్ స్థానం ఇంతకు ముందు ఎలా వుందో ఇప్పుడూ అదే 108 వద్ద వుంది. దీని బట్టి చూస్తే అన్ని రంగాల్లో స్త్రీలకు సమాన అవకాశాలు అని చెప్పడం మాటలకే పరిమితమని తెలుస్తుంది. ఈ సూచీలో భారత్‌ 108వ స్థానంలో ఉండగా... డబ్ల్యూఈఎఫ్‌ వెల్లడించిన జాబితాల్లో గత రెండేళ్లుగా భారత్‌ పరిస్థితి వొకే విధంగా ఉంది. విద్య, ఆరోగ్యకరమైన జీవనం, ఉపాధి అవకాశాలు, రాజకీయ ప్రాతినిధ్యం ప్రాతిపధికగా డబ్ల్యూఈఎఫ్‌ లింగ భేదాన్ని లెక్కిస్తుంది. అయితే మరోవైపు స్ర్తీ, పురుష వేతనాల్లో మెరుగైన పరిస్థితి ఉందని పేర్కొంది. వొకే పనికి స్ర్తీ, పురుషులు ఇద్దరికీ సమాన వేతనం అందుతోందని తెలిపింది. ఇక విద్యలో కూడా స్త్రీ, పురుష భేదం తగ్గిందని పేర్కొంది డబ్ల్యూఈఎఫ్‌. అయితే వృత్తి, విద్య సహా వివిధ రంగాల్లో మహిళ ప్రాధాన్యం పెరగాల్సిన అవసరం ఉందని వెల్లడించింది. ఈ జాబితాలో ఐస్‌లాండ్‌ టాప్‌స్పాట్‌లో ఉంది.