వైరల్ అవుతున్న 2022ఫిఫా వరల్డ్ కప్ స్టేడియం ఫోటో

SMTV Desk 2018-12-18 13:29:03  2022 Fifa world cup, Khathar, Lusaile stadiam, Photo vairal

ఖతార్‌, డిసెంబర్ 18: ఫిఫా వరల్డ్ కప్ 2022లో జరగనున్న టోర్నమెంట్‌కు ఖతార్‌లోని దోహా నగరం ఆతిథ్యమిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ టోర్నమెంట్‌ నిర్వహణను దక్కించుకున్న ఖతార్ తాజాగా ప్రారంభ వేడుకలు నిర్వహించే స్టేడియం డిజైన్‌ను ఆవిష్కరించింది.
ప్రస్తుతం లుసైల్ స్టేడియం ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. లుసైల్ స్టేడియం సామర్థ్యం 80 వేలు కాగా అరబ్ నిర్మాణ శైలిలో స్టేడియం ఆకృతిని బ్రిటన్‌కు చెందిన పోస్టర్-పాట్నర్స్ సంస్థ రూపొందించింది. 4500 కోట్లతో ఖతార్ రాజధాని దోహాకు ఉత్తరంగా 15 కిలోమీటర్ల దూరంలో ఈ స్టేడియాన్ని నిర్మిస్తున్నారు.
2020 ఏడాదికి ఈ స్టేడియం నిర్మాణం పూర్తి కానుంది. ఫిఫా వరల్డ్ కప్‌కు మధ్యప్రాచ్యంలో మొదటిసారిగా జరగనున్న నేపథ్యంలో వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌కి ఖతార్ దేశాధినేత షేక్ తమీమ్ బిన్ హమద్ అల్ థాని సహా ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ సహా పలువురు ప్రతినిధులు హాజరుకానున్నారని ప్రపంచకప్ ఉన్నతస్థాయి కమిటీ తెలిపింది.
లుసైల్ స్టేడియం నిర్మాణం ఇప్పటికే 90 శాతం పూర్తి అయిందని సుప్రీం కమిటీ పేర్కొంది. అరబ్ దేశాల్లో మొట్టమొదటిసారి జరగనున్న ఈ ఫిఫా వరల్డ్ కప్ నవంబర్ 21, 2022న ప్రారంభం కానుంది. 2022 ఫిఫా వరల్డ్ కప్‌కు మొత్తం ఎనిమిది స్టేడియాలు ఆతిథ్యమివ్వనున్నాయి.