పెర్త్ టెస్ట్ లో భారత పరాజయం

SMTV Desk 2018-12-18 13:26:50  Team india, Australia, Test match, Perth

పెర్త్, డిసెంబర్ 18: పెర్త్ వేదికగా ఆతిథ్య ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా 146 పరుగుల తేడాతో పరాజయ పాలయింది. ఆసిస్ తొలి ఇన్నింగ్స్‌లో లభించిన 43 పరుగుల ఆధిక్యాన్ని కలుపుకుని మొత్తం 287 పరుగుల లక్ష్యాన్ని కోహ్లీసేనకు నిర్దేశించింది. నాలుగోరోజైన సోమవారం
ఆట ముగిసే సమయానికి భారత్ 41 ఓవర్లు పూర్తయ్యే సరికి 5 వికెట్ల నష్టానికి 112 పరుగుల చేసింది. టిమిండియా 140 ఇన్నింగ్‌ ఆలౌట్‌, ఆసిస్‌ి 243 ఇన్నింగ్‌ ఆలౌట్‌. టీమిండియా బ్యాట్స్‌మన్లలో పంత్ 30, రహానే 30, విహారి 28, విజయ్ 20, కోహ్లీ 17 మినహా మిగిలిన వారెవరూ రెండంకెల స్కోరు చేయలేకపోయారు. ఆసీస్ బౌలర్లలో స్టార్క్, లియాన్ తలో మూడు, కమ్మిన్స్, హజెల్‌వుడ్ తలో రెండు వికెట్లు పడగొట్టారు. ఈ రెండు జట్ల మధ్య మూడో టెస్టు డిసెంబర్ 26 నుంచి మెల్‌బోర్న్ వేదికగా జరగనుంది.