మద్యం మత్తులో తన మర్మాంగాన్ని కోసుకున్న తాగుబోతు

SMTV Desk 2018-12-18 13:24:23  Karnataka, Soladenahalli, Sanjappa, Cutting his penis

కర్ణాటక, డిసెంబర్ 18: కర్ణాటక రాష్ట్రంలో వొక వింత సంఘటన చోటు చేసుకుంది. వొక తాగుబోతు మద్యం మత్తులో తన మర్మాంగాన్ని కోసుకొని చివరికి ప్రాణాలు కోల్పోయాడు. పోలీసుల కథనం ప్రకారం రాష్ట్రంలోని సోలదేనహళ్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని తిరుమళపుర గ్రామ నివాసి అయిన నంజప్ప (57) అనే వ్యక్తి పచ్చి తాగుబోతు. శనివారం రాత్రి పీకల వరకు మద్యం సేవించి కూరగాయలు కోసే కత్తిపీటతో తన మర్మాంగాన్ని కోసుకున్నాడు.
తీవ్ర నొప్పి కలగడంతో మద్యంమత్తు దిగడంతో కేకలు వేశాడు. వెంటనే ఇరుగుపొరుగువారు వచ్చి నంజప్పను చూసి షాక్‌కు గురయ్యారు. ఆ తర్వాత పోలీసులకు, అంబులెన్స్‌కు సమాచారం చేరవేశారు. అంబులెన్స్ సిబ్బంది హుటాహుటిన అక్కడకు చేరుకుని నంజప్పను ఆస్పత్రికి తరలించేలోపు ప్రాణాలు కోల్పోయాడు. తీవ్ర రక్తస్రావం కావడంతో ప్రాణాలు కోల్పోయాడు. దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.