కాశ్మీర్ లో రాష్ట్రపతి పాలన

SMTV Desk 2018-12-18 13:22:49  Jammu kashmir, Governar, President

న్యూ ఢిల్లీ, డిసెంబర్ 18: జమ్ముకశ్మీర్‌లో గత ఆరు నెలలుగా గవర్నర్ పాలన కొనసాగుతూ వస్తుంది. అయితే ఇప్పుడు ఆ పాలన ముగుస్తున్న నేపథ్యంలో ఇక ఆ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని కేంద్రం నిర్ణయించినట్టు విశ్వసనీయ తెలిసింది. అయితే రేపటి నుంచే రాష్ట్రపతి పాలన అమలులోకి రానున్నట్టు సమాచారం. ఈ మేరకు గవర్నర్ సత్యపాల్ మాలిక్ ఇప్పటికే వొక నివేదికను కేంద్రానికి పంపారని అధికార వర్గాల కథనం. గవర్నర్ నివేదికను కేంద్ర క్యాబినెట్ కూడా ఆమోదించిందని, ఇక రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆమోద ముద్ర వేయడమే మిగిలిందని పేర్కొన్నాయి.