అద్దెకు జైళ్ళు?

SMTV Desk 2017-07-26 15:25:56  JAIL, DG VK SINGH, INCOME, RENT

హైదరాబాద్, జూలై 26 : తెలంగాణ జైళ్లలో ఉన్న గదులను అద్దెకిచ్చే దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతున్నట్లు జైళ్ల శాఖ డీజీ వికె సింగ్‌ తెలిపారు. ఇతర రాష్ట్రాలలోని జైళ్లన్ని కిక్కిరిసి ఉండడంతో జైలు గదులను అద్దెకు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. కాగా ఒక్కో ఖైదీకి రూ. 10 వేలు వసూలు చేయనున్నట్లు ఆయన వివరించారు. దీని ద్వారా జైళ్ల శాఖకు ఆదాయం పెరుగనుందని, ఈ ఏడాదిలోనే ప్రతిపాదనను ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తామని వికె సింగ్‌ తెలిపారు.