టాక్సీవాలా కలెక్షన్స్ ఎన్ని కోట్లు ?

SMTV Desk 2018-12-18 13:02:29  taxiwala, vijay devarakonda,taxiwala collections,box office collections

హైదరాబాద్ డిసెంబర్ 18 : రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ కథానాయకుడిగా టాక్సీవాలా సినిమా ఇటీవల విదులయింది .ప్రియాంకజవాల్కర్,మాళవిక నాయర్ కథానాయికలుగా నటించిన ఈ సినిమా నవంబర్ 17వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చి, తొలి ఆటతోనే పాజిటివ్ టాక్ తెచ్చుకుని , తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఓవర్సీస్ లో కుడా మంచి వసూళ్లను సాధించింది.

వసూళ్ల పరంగా గీత గోవిందం .. అర్జున్ రెడ్డి సినిమాల తరువాత స్థానంలో నిలిచింది. ట్రేడ్ వర్గాల నుంచి అందుతోన్న సమాచారం ప్రకారం ఈ సినిమా, అన్ని ప్రాంతాలలోను బాక్సాఫీస్ రన్ పూర్తిచేసుకుంది. మొత్తం గా 21.28 కోట్ల డిస్ట్రిబ్యూటర్ షేర్ ను వసూలు చేసింది. ఓవర్సీస్ లో 3 కోట్ల షేర్ ను రాబట్టగా వొక్క నైజామ్ ఏరియాలోనే ఈ సినిమా 7.70 కోట్ల షేర్ ను సాధించింది . ఆవిధంగా ఈ సినిమాను కొన్నోళ్ళందిరికి వాళ్లందరికీ మంచి లాభాలను తెచ్చిపెట్టింది.