రజినీకాంత్ ఖాతా లో మరో క్రేజి ప్రాజెక్ట్

SMTV Desk 2018-12-18 12:13:19  rajinikanth,murugadas,muraga doss, robo 2.o,anirudh,lyca

హైదరాబాద్ డిసెంబర్ 18 : సూపర్ స్టార్ రజనీకాంత్ ఈ మధ్య విరామం లేకుండగా వరుస సినిమాలు చేస్తూ వస్తున్నారు. 2.ఓ సినిమాతో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న ఆయన, సంక్రాంతికి పెట్టా సినిమాతో ప్రేక్షకులను పలకరించనున్నారు. ఇదిలా ఉండగానే ఆయన మురుగదాస్ దర్శకత్వంలో మరో ప్రాజెక్టుకు తయారవుతున్నడంటూ గత కొన్ని రోజులుగా వార్తలొస్తున్నాయి.

తాజాగా ఈ వార్తపై మురుగదాస్ స్పందిస్తూ,ఆ వార్తలు నిజమేనని చెప్పారు. అయితే అంతా కూడా ఈ సినిమా మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఉంటుందని అన్నారు. అనిరుధ్ సంగీత దర్శకుడిగా వ్యవహరించనున్న ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ వారు నిర్మించనున్నారనీ చెప్పారు.