'ఆర్ ఆర్ ఆర్' సినిమా తాజా వార్త

SMTV Desk 2018-12-18 11:19:05  ntr,rrr,ramcharan,samudrakani, ss rajamauloi, bahubali

హైదరాబాద్ , డిసెంబర్ 18 :దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ , చరణ్ కథానాయకులుగా " ఆర్ ఆర్ ఆర్ " అనే భారీ చిత్రం రూపొందుతోంది. ఇటీవలే ఫస్టు షెడ్యూల్ ను పూర్తి చేసుకున్న ఈ సినిమా, జనవరిలో సెకండ్ షెడ్యూల్ ను మొదలెట్టనుంది. ఈ కథ బ్రిటిష్ కాలం నేపథ్యంలో కొనసాగుతుందనే ఊహాగానాలు మొదటినుండే వినిపించాయి.

ఇక తాజాగా మరో టాక్ ఫిల్మ్ నగర్లో షికారు చేస్తోంది. ఈ సినిమాలో బ్రిటిష్ పోలీస్ ఆఫీసర్ గా చరణ్ , బందిపోటు పాత్రలో ఎన్టీఆర్ కనిపిస్తాడని అంటున్నారు. ఇక చరణ్ బాబాయ్ పాత్రలో ప్రముఖ దర్శకుడు నటుడు సముద్రఖని నటిస్తున్నట్టుగా తెలుస్తోంది. రఘువరన్ బీటెక్ లో ధనుశ్ తండ్రి పాత్ర ద్వారా సముద్రఖని తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు . ఈ సినిమా లో కూడా ఆయన పాత్ర చాలా కీలకమైనదని అంటున్నారు. వాస్తవమెంతో సినిమా విడుదల తర్వాత తెలుస్తుంది .