‘సాహో’ రిలీజ్ డేట్ ఫిక్స్… ఎప్పుడంటే ?

SMTV Desk 2018-12-18 11:04:12  prabhas,sahoo,

హైదరాబాద్, డిసెంబర్ 18: బహుబలి సినిమాతో ప్రభాస్ రేంజ్ ఎంత ఎదిగిపోయిందో తెలిసిందే. తెలుగు సినిమా పరిశ్రమను ప్రపంచానికి చాటి చెప్పిన సినిమా ఏదైన ఉందా? అంటే అది వొక్క బహుబలి మాత్రమే. ఈ సినిమా తర్వాత ప్రభాస్.. సుజీత్ దర్శకత్వంలో వస్తున్న ‘సాహో సినిమాలో నటిస్తున్నాడు. ఈ మూవీ వొకేసారి తెలుగు, తమిళం, హిందీలో దాదాపు రూ.300 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు.

ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా షేడ్స్ ఆఫ్ సాహో చాప్టర్1 పేరుతో రిలీజ్ చేసిన మేకింగ్ వీడియో హాలీవుడ్ రేంజ్‌లో ఉండటంతో అభిమానుల్లో భారీ అంచనాలు పేరిగిపోయాయి. చాలా రోజులుగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను 2019 స్వతంత్ర దినోత్సవ కానుకగా విడుదల చేస్తున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ఈ చిత్రంలో ప్రభాస్ సరసన శ్రద్ధా కపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. అలాగే బాలీవుడ్ నటులు జాకీ ష్రాఫ్, నీల్ నితిన్ ముఖేశ్, చుంకీ పాండే, మందిరా బేడీ, ఎవ్లిన్ శర్మ పలు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. శంకర్-ఎహసాన్-లాయ్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్‌ సంస్థ నిర్మిస్తోంది.