ముగిసిన నాలుగో రోజు ఆట

SMTV Desk 2018-12-17 18:30:56  Team india, Australia, Test match, Perth

పెర్త్, డిసెంబర్ 17: పెర్త్ స్టేడియం వేదికగా భారత్ - ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న టెస్ట్ మ్యాచ్ రెండో ఇన్నింగ్స్ లో నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 41 ఓవర్లు పూర్తయ్యే సరికి 5 వికెట్ల నష్టానికి 112 పరుగుల చేసింది. ఐదోరోజు ఆడాల్సి ఉంది. అయితే భారత్ జట్టు విజయలక్ష్యం చేరుకోవడానికి 175 పరుగులు చేయాల్సి ఉంది.

హనుమ విహారి 24, రిషబ్ పంత్ 9 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఆసీస్ బౌలర్లు హజెల్ వుడ్ రెండు, లియోన్ రెండు, మిట్చెల్ స్టార్క్ వొక వికెట్ చొప్పున తీశారు. మ్యాచ్ గెలిచేందుకు భారత్ కు 5కెవిట్లు మాత్రమే ఉన్నాయి.