రేపు కళ్యాణ్ రామ్ '118' టీజర్

SMTV Desk 2018-12-17 18:21:55  Kalyan ram, East productions, KV Guhan, 118

హైదరాబాద్, డిసెంబర్ 17: నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై కేవీ గుహన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 118 . మహేష్ కోనేరు ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రంలో కళ్యాణ్ రామ్ సరసన నివేదా థామస్, షాలిని పాండే హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రం కోసం కళ్యాణ్ రామ్ కొన్ని రిస్కీ సన్నివేశాల్లో నటించబోతున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్ కి మంచి స్పందన వచ్చింది. రేపు ఉదయం 10 గంటల 30 నిమిషాలకి సినిమా టీజర్ ను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తూ వొక పోస్టర్ ను విడుదల చేశారు. ఫిబ్రవరి 19వ తేదీన ఈ సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో వున్నారు. ఈ సినిమాతో కళ్యాణ్ రామ్ హిట్ కొట్టడం ఖాయమంటున్నారు.

ఇక ఈ సినిమా తర్వాత యువ దర్శకుడుతో సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. ఉయ్యాలా జంపాలా, మజ్ను చిత్రాలతో ఆకట్టుకున్న విరంచి వర్మ కళ్యాణ్ రామ్‌కి ఈమధ్యే వొక ఇంట్రెస్టింగ్ స్టొరీ.. డిఫరెంట్ హీరో క్యారెక్టరైజేషన్‌తో స్టోరీ చెప్పడం… వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగిందట. ఈ సినిమాను హారిక హాసిని క్రియేషన్స్ సంస్థ నిర్మించనుందని సమాచారం. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. జనవరిలో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనున్నట్టు సమాచారం. మరి… సరైన సక్సస్ కోసం ఎదురుచూస్తోన్న కళ్యాణ్ రామ్‌ని విరంచి వర్మ కొత్తగా ఎలా చూపించనున్నాడో చూడాలి.