తప్పు చేస్తున్నారు చంద్రబాబు గారూ!: జగన్

SMTV Desk 2017-07-26 15:00:28  jagan twit on chandra babu, mudragada, protest, house arrest, kapu riservation,

అమరావతి, జూలై 26: కాపుల రిజర్వేషన్ కోసం ఉద్యమం చేస్తున్న ముద్రగడ పద్మనాభం ఈ రోజు తలపెట్టిన పాదయాత్రను పోలీసులు అడ్డుకోవడంతో రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ పాదయాత్రకు అనుమతి లేదని ముద్రగడను పోలీసులు గృహనిర్భంధం చేసిన సంగతి తెలిసిందే. తాజాగా వై.యస్.జగన్మోహన్ రెడ్డి, ముద్రగడ గృహనిర్భంధంపై చంద్రబాబునాయుడిని ట్వీట్టర్‌లో “ముఖ్యమంత్రిగారూ...ఒక్క విషయం చెప్పండి! ముద్రగడ గారిని హౌస్ అరెస్ట్ ఎందుకు చేశారు..? కాపులకు మీరిచ్చిన హామీని , మేనిఫెస్టోలో మీరిచ్చిన వాగ్దానాన్నినిలబెట్టుకోండి అనే కదా వారు మిమ్మల్ని నిలదీస్తున్నది? ఇలా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నందుకు అరెస్టులు, హౌస్ అరెస్ట్‌లు, బైండోవర్లు చేయడం ఏమిటి..? వేల మంది పోలీసుల్ని మోహరించటం ఏమిటి..? తప్పు చేస్తున్నారు చంద్రబాబు గారూ!” అంటూ ఆయన నిలదీశారు.