రూ.84 లక్షల కాయిన్స్ చోరికి పాల్పడ్డ బ్యాంక్ మేనేజర్

SMTV Desk 2018-12-17 13:05:03  SBI, SBI Bank manager, Money theft, Kolcutta, Memori

కోల్‌కత్తా, డిసెంబర్ 17: నగర సమీపంలోని మోమారిలో ఉన్న ఎస్‌బీఐ బ్యాంక్ లో వింత ఘటన చోటుచేసుకుంది. సంవత్సరం నుండి ఆ బ్యాంక్ లో అసిస్టెంట్ మేనేజర్ గా పనిచేస్త్తున్న తారక్ జైశాల్ అనే వ్యక్తి ఏకంగా 84లక్షల రూపాయి కాయిన్స్ దొంగలించాడు. పోలీసుల వివరాల ప్రకారం తారక్ బ్యాంక్ నుండి రోజూ కొన్ని నాణాలను దొంగాలించేవాడట. అలా.. నెలకు 50 వేల రూపాయల విలువైన కాయిన్స్ దొంగలించడమే కాకుండా మొత్తం.. 84 లక్షల రూపాయల కాయిన్స్ దొంగలించాడు.





ఆ కాయిన్స్‌తో లాటరీ టికెట్లు కొంటూ మొత్తం 84 లక్షలను లాటరీ టికెట్లకే తగలేశాడట. అయితే..తారక్ చేస్తున్న దొంగతనం మొత్తం వార్షిక ఆడిట్‌లో తెలిసిపోయింది. బ్యాంక్ ఆడిట్‌లో భారీ మొత్తంలో కాయిన్స్ మిస్సయినట్టు గ్రహించిన బ్యాంకు అధికారులు.. తారక్‌పై కన్నేశారు. దీంతో అతను తన బండారం ఎక్కడ బయటపడుతుందోనని బ్యాంకుకు వెళ్లడమే మానేశాడు. అయితే తారకే ఆ దొంగతనం చేశాడని కన్ఫర్మ్ చేసుకున్న బ్యాంక్ అధికారులు పోలీసులకు సమాచారం అందించడంతో అతడిని అదుపులోకి తీసుకొని విచారించగా.. తానే ఆ కాయిన్స్‌ను దొంగలించినట్టు పోలీసుల ముందు వొప్పుకున్నాడు.