ఏడేళ్ళ తర్వాత తెరపైకి సూరి కేసు..

SMTV Desk 2018-12-17 11:41:53  Paritala Ravi, Maddelacheruvu Suri, Bhanu Kiran, Suri Murder Case

హైదరాబాద్, డిసెంబర్ 17: పరిటాల రవి హత్య కేసులో ప్రధాన నిందితుడు మద్దెలచెరువు సూరి హత్య కేసు మల్లి తేరపై కి వచ్చింది. సూరిని హత్య చేసింది తన ప్రధాన అనుచరుడు భానుకిరణ్ అని అందరికి తెలిసిన విషయమే. ఈ మంగళవారం సూరి కేసులో హైదరాబాద్ నాంపల్లి కోర్ట్ తుది తీర్పు ఇవ్వనుంది. అయితే ఈ కేసులో భానుకి శిక్ష పడనుందా లేదా నిర్దోషిగా తేల్చనుందా తెలియాల్సి ఉంది. కాగా, సూరి భార్య మాత్రం భానుకి తప్పకుండ ఉరి శిక్ష గాని జీవిత ఖైదు గాని పడుతుంది అని ధీమా వ్యక్తం చేసారు.

హైదరాబాద్ లోని మూసాపేట్ లో వొక లాయర్ ని కలిసి తిరిగి వస్తుండగా 2011 జనవరి 3 న సాయంత్రం శ్రీనగర్ కాలనీ సమీపంలోని నవోదయ కాలనిలో సూరి దారుణ హత్యకు గురైయ్యాడు. పాయింట్ బ్లాంక్ లో కాల్చడం వల్లే సూరి చనిపోయాడని ఫారెన్సిక్ రిపోర్ట్ లో వెల్లడైంది, హత్య జరిగిన వెంటనే పారిపోయిన భానునే చేసాడని పోలీసులు నిర్దారించారు. కాగా, 14 నెలల తర్వాత భాను పోలీసులకి దొరికాడు. సూరి జైలులో ఉన్నపుడు చాల సెటిల్మెంట్లు చేసి భాను కోట్ల రూపాయలు సంపాదించాడు, అవి అన్ని తన పేరుకు బదిలీ చేయమన్నందుకు సూరిని హత్య చేసి ఉంటాడు అని అనుమానం. ఈ కేసు విషయంలో ఎలాంటి పురోగతి లేనందువల్ల అధికారులు ఈ కేసును సిసిఎస్ నుంచి సిబిఐకి అప్పగించారు. ఈ కేసు విషయంలో సినీ నిర్మాతలు సి.కళ్యాణ్, సింగనమల రమేష్ లని కూడా ఆ మధ్య పోలీసులు అరెస్ట్ చేసారు. ఇంకా ఈ ఘటనలో చాల మంది ప్రముఖుల ప్రమేయం ఉందని సమాచారం. రేపు ఈ కేసులో నాంపల్లి కోర్టు తీర్పు ఇవ్వనుంది, ఎవరెవరికి శిక్ష పడుతుందో వేచిచూడాలి.