సింధు నయా చరిత్ర, కెసిఆర్ అభినందనలు

SMTV Desk 2018-12-16 15:22:39  KCR, PV Sindhu

ఇండియా స్టార్ షట్లర్ పీవీ సింధు సరికొత్త చరిత్ర సృష్టించింది. సుదీర్ఘకాలంగా భారతీయులకి అందని ద్రాక్షగా మిగిలిపోయిన బీడబ్ల్యూఎఫ్‌ ప్రపంచ టూర్‌ ఫైనల్స్‌లో ఈరోజు విజేతగా నిలిచింది. వొకుహరతో ఆదివారం జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో 21-19, 21-17 తేడాతో గెలిచిన పీవీ సింధు ఎట్టకేలకి బంగారు పతకాన్ని కైవసం చేసుకుంది. ఈ సందర్బంగా తెలంగాణ ముఖ్య మంత్రి పీవీ సింధు ను అభినందించారు , భవిష్యత్ లో మరిన్ని విజయాలు సాధించాలని ఆయన కోరారు ..