ఓ బేబే ఎంత సక్కగున్నావే

SMTV Desk 2018-12-16 15:09:51  Samantha, Samantha Akkineni, Entha Sakka Gunnave

హైదరాబాద్ , డిసెంబర్ 16:సౌత్ లో స్టార్ హీరోయిన్ గా సూపర్ క్రేజ్ తెచ్చుకున్న సమంత అక్కినేని కోడలుగా మారిన తర్వాత కమర్షియల్ సినిమాల కన్నా ప్రయోగాత్మక సినిమాలకే ఎక్కువ ఇంట్రెస్త్ చూపిస్తుంది. యూటర్న్ సినిమాతో పర్వాలేదు అనిపించుకున్న సమంత ప్రస్తుతం నాగ చైతన్య సరసన మజిలి సినిమా చేస్తుంది. నిన్నుకోరి శివ నిర్వాణ డైరక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటుంది.

ఇక ఈ సినిమాతో పాటుగా సమంత నందిని రెడ్డి డైరక్షన్ లో ఓ సినిమా చేస్తుంది. కొరియన్ మూవీ మిస్ గ్రానికి రీమేక్ గా వస్తున్న ఈ మూవీలో సమంత 70 ఏళ్ల బామ్మగా కనిపించనుందట. సురేష్ ప్రొడక్షన్స్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాకు టైటిల్ గా ఓ బేబే ఎంత సక్కగున్నావే అంటూ పెడుతున్నారట. రంగస్థలంలో ఎంత సక్కగున్నావే సెంటిమెంట్ తో ఈ టైటిల్ పెట్టినట్టు తెలుస్తుంది. ఆ పాట హిట్టైంది.. ఆ సినిమా హిట్టైంది.. అదే మాదిరిగా ఈ సినిమా కూడా హిట్ అవుతుందేమో చూడాలి.