విలన్ గా మోహన్ లాల్.

SMTV Desk 2018-12-16 15:05:46  Mohanlal, Villain,

హైదరాబాద్ , డిసెంబర్ 16: మళయాల సూపర్ స్టార్ హీరో మోహన్ లాల్ ఈమధ్య సౌత్ లో అన్ని భాషల్లో సినిమాలు చేస్తున్నారు. ముఖ్యంగా తెలుగులో జనతా గ్యారేజ్, మనమంతా సినిమాలతో మంచి క్రేజ్ తెచ్చుకోగా ఆ తర్వాత డబ్బింగ్ సినిమాగా వచ్చిన మన్యం పులి సూపర్ హిట్ అయ్యింది. రీసెంట్ గా వొడియన్ మూవీ కూడా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మళయాల సూపర్ స్టార్ గా మోహన్ లాల్ చేయని ప్రయోగం లేదని తెలిసిందే.

అందులో భాగంగా ఇప్పుడు ప్రతినాయకుడి పాత్రలో కూడా నటిస్తున్నాడట మోహన్ లాల్. రాజమౌళి తనయుడు మొదటి ప్రయత్నంగా చేస్తున్న ఆకాశవాణి సినిమాలో విలన్ పాత్ర చాలా వెరైటీగా ఉంటుందట. ఆ పాత్ర కోసం మోహన్ లాల్ తో సంప్రదింపు జరుపుతున్నారట. వొకవేళ ఆయన వొప్పుకుంటే పర్వాలేదు నో చెబితే మాత్రం రాజశేఖర్ తో చేయించాలని చూస్తున్నారట.

రాజమౌళి చేస్తున్న సినిమాల్లో సెకండ్ యూనిట్ డైరక్టర్ గా మంచి పేరు తెచ్చుకున్న కార్తికేయ చేస్తున్న ఆకాశ్వాణి ఎలా ఉండబోతుందో చూడాలి. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఫిబ్రవరిలో మొదలవుతుందని తెలుస్తుంది.

.