చరణ్, బన్ని అతిథులు

SMTV Desk 2018-12-16 13:45:45  Charan, Allu Arjun,

డిసెంబర్ 21న 3 భారీ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. అందులో వొకటి కన్నడ డబ్బింగ్ సినిమా. యశ్ హీరోగా కె.జి.ఎఫ్ భారీ అంచనాలతో వస్తుంది. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో రాజమౌళి అటెండ్ అవడం సినిమాపై క్రేజ్ తెచ్చిపెట్టింది. ఇక మిగతా రెండు సినిమాలు కూడా భారీ అంచనాలతో వస్తున్నాయి. అందులో వొకటి శర్వానంద్ పడి పడి లేచే మనసు కాగా.. మరోటి వరుణ్ తేజ్ అంతరిక్షం.

రెండు వేరు వేరు జానర్స్.. అంతరిక్షం తెలుగులో మొదటి స్పేస్ సినిమాగా వస్తుంది. పడి పడి లేచే మనసు సినిమా హను రాఘవపుడి మార్క్ లవ్ స్టోరీగా వస్తుంది. ఇక ఈ రెండు సినిమాలు వొకేరోజు రిలీజ్ అవడం క్రేజీగా మారగా.. ఈ సినిమాల ప్రీ రిలీజ్ ఈవెంట్స్ తో సినిమాల మీద మరింత ఆసక్తి కలిగేలా చేస్తున్నారు.

డిసెంబర్ 17న పడి పడి లేచే మనసు సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగనుంది.. ఈ ఈవెంట్ కు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అటెండ్ అవుతున్నట్టు తెలుస్తుంది. ఇక ఆ మరుసటి రోజే అంటే డిసెంబర్ 18న అంతరిక్షం ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగనుంది. ఈ ఈవెంట్ లో మెగా పవర్ స్టార్ రాం చరణ్ అతిథిగా వస్తున్నాడట. అలా చరణ్, బన్ని రాబోతున్న సినిమాలకు ఎతిథిలుగా మారడం మెగా ఫ్యాన్స్ లో ఉత్సాహాన్ని నింపింది.