'బంగార్రాజు' మళ్ళీ రావడానికి సిద్దమవుతున్నాడు

SMTV Desk 2018-12-15 18:42:46  Soggade Chinni Nayana, Nagarjuna, Ramya Krishnan, Lavanya Tripathi, KALYAN KRISHNA

హైదరాబాద్, డిసెంబర్ 15: : సోగ్గాడే చిన్నినాయనా 2016 సంక్రాంతి పోరులో నిలిచి గెలిచిన సినిమాల్లో వొకటి నాగార్జున కెరియర్లో చెప్పుకోదగిన సినిమాల లో వొకటిగా కనిపిస్తుంది. ఈ సినిమాలో నాగార్జున పోషించిన బంగార్రాజు పాత్రకి విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. దాంతో ఆ పాత్రను ప్రధానంగా చేసుకుని నడిచే కథను సిద్ధం చేయమని అప్పట్లోనే దర్శకుడు కల్యాణ్ కృష్ణ కి నాగార్జున చెప్పారు. ఆ తరువాత కల్యాణ్ కృష్ణ కథ చెప్పడం నాగార్జున మార్పులు చెప్పడం ఇలా ఇప్పటి వరకు జరుగుతూ వచ్చింది.

ఏది ఏమయినా ఆ కథ ఓ కొలిక్కి తెచ్చేశాక పెర్ఫెక్ట్ గా కథ రెడీ అయింది. పాత కథకి తగ్గట్టుగానే నాగార్జున సరసన కథానాయికగా రమ్యకృష్ణను ఖరారు చేశారట. మరో జోడీలో చైతూను మాత్రం తీసుకున్నారు. కథానాయికగా ఇంకా ఎవరిని ఖరారు చెయ్యలేదు . చైతూకి జోడీ సెట్ కాగానే అధికారిక ప్రకటన వెలువడనుందని అంటున్నారు.