నేడు ఉక్కు మనిషి వర్థంతి

SMTV Desk 2018-12-15 16:23:12  sardar vallabhai patel, statue of unity,sardar

హైదరాబాద్ , డిసెంబర్ 15 : ఆయన అప్పుడు లేకపోతే ఇప్పుడు హైదరాబాద్ వెళ్ళడానికి కి వీసా అవసరమయ్యేది , అయన అప్పుడు నడవకపోతే ఇప్పుడున్న భారత దేశం రూపు వేరే విధంగా ,అంద విహీనంగా ఉండేది , దేశం మొత్తం తిరిగి స్వతంత్రయం వచ్చిన తర్వాత కూడా , సంస్థానాలుగా విరిగిపోయున్న మన భారత దేశాన్ని వొక్కటయేయి కాదు , ఆయన ఎవరో కాదు ఉక్కు మనిషి " సర్దార్ వల్లభాయ్ ".

ఈ రోజు ఆయన వర్థంతి, మన దేశాన్ని వొక్క తాటి పై కి తెచ్చిన ఉక్కు మనిషికి కృతజ్ఞతతో ,నివాళులు . సర్దార్ వల్లభాయ్ పటేల్ గారికి దేశవ్యాప్తంగా నివాళులు అర్పించారు.

సర్దార్ పటేల్ అని పిలవబడే వల్లభాయ్ పటేల్ గారు 31 అక్టోబరు 1875 లో మధ్య గుజరాత్లో జన్మిచాడు ఆయన పుట్టు పూర్వాపరాలు మీద ఎక్కడ కచ్చితమయిన ఆధారలులేవు ఆయనొక రాజకీయవేత్త ,బారిస్టర్ మరియు రాజనీతిజ్ఞుడు. ఆయనే భారతదేశపు మొదటి ఉప ప్రధాని . ఆయన , ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ లో సీనియర్ నాయకుడు మరియు భారతదేశపు రిపబ్లిక్ వ్యవస్థాపక కర్త . స్వాతంత్ర పోరాటంలో ప్రధాన పాత్ర పోషించి, స్వతంత్ర దేశంలో సమగ్రత , సమైక్యతకు మార్గనిర్దేశం చేసారు. భారతదేశంలో మరియు ఇతర ప్రాంతాల్లో ఆయన తరచుగా సర్దార్ అని పిలవబడ్డారు, దీని అర్థం హిందీ, ఉర్దూ మరియు పర్షియన్లలో "ప్రధాన". భారతదేశ రాజకీయ సమైక్యత మరియు 1947 నాటి ఇండో-పాకిస్తాన్ యుద్ధం సందర్భంగా భారత సైన్యం యొక్క ప్రధాన కమాండర్-ఇన్-చీఫ్ గా కూడా వ్యవహరించారు .


డిసెంబరు 15, 1950 న ఆయన పరమపదించారు, ఈ రోజు ఆయన వర్థంతి, మన దేశాన్ని వొక్క తాటి పై కి తెచ్చిన ఉక్కు మనిషికి కృతజ్ఞతతో ,నివాళులు దేశవ్యాప్తంగా నివాళులు అర్పించారు.