తొలిసారిగా అయోధ్యలో అడుగుపెడుతున్న యోగి ఆదిత్యనాథ్

SMTV Desk 2017-05-31 14:55:06  suprime court, babri masidh, lakkhnavu,cbi,lk adwani,muralimanoharjoshi,umabharathi,up cm adityanath yogi,ayodya temple,

అయోధ్య, మే 29 : సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు బాబ్రీ మసీదు కూల్చివేత కేసు విచారణను ప్రారంభించిన లఖ్‌నవూలోని అగ్రనేతల పై సీబీఐ కోర్టు మంగళవారం రోజున భాజపా అగ్రనేతలు ఎల్ కే అద్వానీ, మురళిమనోహర్ జోషి, ఉమాభారతి సహా మరికొందరు అగ్రనేతలపై కుట్ర అభియోగాలను నమోదు చేశారు. కోర్టు వీరికి బెయిల్‌ మంజూరు చేస్తూ తాత్కాలిక వురట కల్పించారు. కల్పించిన మరుసటి రోజే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ఆధిత్యనాథ్ అయోధ్యకు వెళ్ళనున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా రామ జన్మభూమి- బాబ్రి మసీదు స్థలాని సందర్శించి అక్కడ ఉన్న రామాలయంలో ప్రత్యేక పూజలు నివహిస్తున్నట్లు వెల్లడించారు. సీఎంగా బాధ్యతలు చేపట్టిన తరువాత అయోధ్యకు యోగి ఇదే తొలి సారిగా రావడం. కాగా ... భాజపా నేతలకు బెయిల్ వచ్చిన మరుసటి రోజే.. యూపీ సీఎం యోగి అయోధ్యకు వెళ్ళడం చర్చనీయంశమై మారుమోగింది. ఇందులో చర్చించాల్సిన విషయం ఏమిలేదని, యోగి పర్యటన షెడ్యూల్‌ ఇంతకు మునుపై ఖరారు చేసిందని భాజపా నేతలు వెల్లడించారు. తాజాగా తీసుకున్న నిర్ణయం కాదని పేర్కొన్నారు.