బండ్ల గణేష్ ఎక్కడ ?

SMTV Desk 2018-12-15 13:04:37  bandla ganesh,mojo tv,tv9

హైదరాబాద్ , డిసెంబర్ 15 : "సినిమాల ప్రభావం జనాల మీద ఎంతుందో తెలీదు కానీ పంచ్ డైలాగ్ ల ప్రభావం మాత్రం భారీగా ఉంది " ఇది వొక తెలుగు సినిమా డైలాగ్ , ఇప్పుడెందుకు ప్రస్థావించాల్సిన అవసరమొచ్చిందంటే , 2108 అసెంబ్లీ ఎలెక్షన్స్ లో కెసిఆర్ మళ్ళీ గెలిచి సీఎం అయ్యాడు , కానీ జనాలు మాత్రం దానితో సమానం గా " బండ్ల గణేష్ 7ఓ క్లోక్ బ్లేడ్ " శపదం గురించి చర్చించుకుంటున్నారు, సామజిక మాధ్యమాల్లో అయితే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు ట్రోల్ పేజెస్ కి దొరికిన మరొక లడ్డు .

విషయం ఏంటంటే ఎలక్షన్స్ ముందు జరిగిన వొక ఇంటర్వ్యూ లో నటుడు ,నిర్మాత బండ్ల గణేష్ కాంగ్రెస్ 80 సీట్లతో ప్రభుత్వాన్ని ఫార్మ్ చేస్తదని , అలా చెయ్యకపోతే " 7ఓ క్లోక్ బ్లేడ్ "తో పీక్కోసుకుంటాని శపధం చేసాడు . తనకు టికెట్ రాకముందే , వొకడుగు ముందుకేసి ప్రమాణ స్వీకారం కూడా చేసేశాడు . కానీ కథ అడ్డం తిరిగంది బండ్లకి సీట్ దక్కక పొగ ,మహాకూటమి చిత్తుగా ఓడింది .

కథ అక్కడితో అవ్వలేదు , కౌంటింగ్ అనంతరం ఆ ఛానల్ టీం బండ్ల కోసం వెతుకుతూ జనాలను అతని గురించి అడగగా ఆటలో అరటిపండు , కామెడీ పీస్ , పిచోడు అంటూ వొకరిని మించి వొకరు కామెడీ చేస్తున్నారు . అది అటుంచితే జరిగిన విషయం మీద బండ్ల గణేష్ కి సపోర్ట్ గా మాట్లాడే ఘనులు ఇంకా ఈ సమాజంలో ఉన్నారని వీడియో క్రింద ఉంచిన కామెంట్స్ చూస్తే తెలుస్తుంది .