ఘనంగా టీ-శాట్ నెట్ వర్క్ ప్రారంభం

SMTV Desk 2017-07-26 13:34:29  KTR, POCHAARAM SRINIVAAS, T-SHAT, LOGO, THEAM SONG

బేగంపేట, జూలై 26 : నేడు బేగంపేటలోని ఐటీసీ కాకతీయ హోటల్లో టీ-శాట్ నెట్ వర్క్ ప్రారంభోత్సవ కార్యక్రమం జరుగుతుంది. దీనికి ముఖ్య అతిధిగా మంత్రి కేటీఆర్ హాజరయ్యారు. ముందుగా కార్గిల్ అమర వీరులకు నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి మంత్రులు లక్ష్మారెడ్డి, తలసాని తదితరులు హాజరు కాగా...టీ-శాట్ లోగోను మున్సిపల్ శాఖా మంత్రి కేటీఆర్, వ్యవసాయ శాఖా మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి గారి చేతుల మీదుగా ఆవిష్కరించారు. అనంతరం అంబేద్కర్ యూనివర్సిటీ వైస్ చాన్సలర్ సీతా రామారావు గారు టీ-శాట్ థీమ్ సాంగ్ ను ఆవిష్కరించారు. విద్య, ఉద్యోగం, ఉపాధి, ఆరోగ్యం, తెలంగాణ వాసులలో చైతన్యం నింపడం, ఉపాధి అవకాశాలపై అవగాహన పెంపొందించడం, యువతను దేశాభివృద్ధిలో భాగస్వామ్యం చేయడం, వ్యవసాయరంగాన్ని లాభసాటిగా తీర్చిదిద్దడం, ప్రపంచ పటంలో తెలంగాణకు గౌరవనీయ స్థానం కల్పించడం ఇవన్నీ తెలంగాణ ముందున్న లక్ష్యాలు. ఇదే ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశయమని, అంతేకాకుండా రానున్న రోజుల్లో నాలుగు కోట్ల జనాభా టీ-శాట్ ప్రసారాలను వీక్షించే విధంగా సదుపాయాన్ని కల్పించబోతున్నారని మంత్రులు తెలియజేశారు.