ముదిరిన 'మెహ్రీన్' వివాదం

SMTV Desk 2018-12-15 11:38:24  mehrene , suderbabu,maa,tollywood,krishna gaadi veera prema gadha, f2 , kalyan dev

హైదరాబాద్ , డిసెంబర్ 15 : మెహ్రీన్ తెలుగు తెరకి పరిచయమైన అందమైన కథానాయికలలో వొకరు . అందం అభినయం తో మెప్పించే ఈమె ను , ఇటీవల పరాజయాలు పలకరిస్తున్నా ఆరంభంలో వరుస విజయాలు అందుకున్న కథానాయిక. ఆమె తాజా గా నటించిన చిత్రం ఎఫ్ 2 తో ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో సుధీర్ బాబు కి జంటగా వొక సినిమా చేయడానికి మెహ్రీన్ అంగీకరించింది. ఆ తరువాత ఆ ప్రాజెక్టు నుంచి సుధీర్ బాబు తప్పుకోగా , నిర్మాతలు చిరంజీవి చిన్నల్లుడు కల్యాణ్ దేవ్ ను హీరోగా తీసుకున్నారు.

ఇప్పుడు వాళ్లు ఆయన జోడీగా మరో హీరోయిన్ ను తీస్కోవాలనుకుని , మెహ్రీన్ కి ఇచ్చిన అడ్వాన్స్ తిరిగి ఇవ్వాలని కోరారు. అయితే తన డేట్స్ వేస్ట్ అయ్యాయనీ, ఆ కారణంగా రెండు సినిమాలు కూడా వదులుకున్నాననేది మెహ్రీన్ వాదన. దాంతో ఈ గొడవ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ కి, మూవీ ఆర్టిస్ట్స్ అసోసియోషన్ కి చేరింది. ఏం జరుగుతుందో చూద్దాం .