రిపీట్ అవుతున్న క్రేజి కాంబినేషన్

SMTV Desk 2018-12-14 17:53:25  allu arjun ,trivikram,maruthi,telugu cinema

హైదరాబాద్ , డిసెంబర్ 14: స్టైల్ స్టార్ అల్లుఅర్జున్ గత రెండు సినిమాలు నిరాశపరచడంతో ఈ సారి తప్పకుండా హిట్ కొట్టాలనే పట్టుదలతో వున్నాడు. హిట్ పై ఎక్కువ భరోసా కావాలంటే త్రివిక్రమ్ తో చేయడమే కరెక్ట్ అనుకుని ఆయన కోసం వెయిట్ చేశాడు. తన పై బన్నీ పెట్టుకున్న నమ్మకానికి తగినట్టుగా త్రివిక్రమ్ వొక కథను సిద్ధం చేసి బన్నీకి వినిపించగా , బన్నీ కొన్ని మార్పులు చెయ్యమని చెప్పాడు . త్రివిక్రమ్ ఆ మార్పులు పూర్తి చేసి పూర్తి స్క్రిప్ట్ తో బన్నీని వొప్పించాడు.

దాంతో ఈ సినిమాను జనవరిలో లాంచ్ చేయడానికి రంగం సిద్ధమైపోయింది. ఫిబ్రవరి నుంచి రెగ్యులర్ షూటింగును మొదలు పెడుతున్నట్లుగా తెలుస్తోంది. ఈలోగా నటీనటులు సాంకేతిక నిపుణుల ఎంపిక ప్రక్రియను పూర్తిచేయనున్నారు. హారిక అండ్ హాసిని గీతా ఆర్ట్స్ వారు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించనున్నట్టు సమాచారం. బన్నీ తరువాత సినిమా కోసం మారుతీ రెడీ గా ఉన్నాడు .