' ప్రాణ ' సినిమా తాజా సమాచారం

SMTV Desk 2018-12-14 16:21:52  nithya menon,prana,pc sree ram, vijay

కేరళ , డిసెంబర్ 14:"ప్రాణ " మలయాళ, తెలుగు, కన్నడ మరియు హిందీ భాషలలో చిత్రీకరణ జరుపుకునే బహుభాషా చిత్రం. సైకాలజీ త్రిల్లర్ గా రూపొందుతున్న ఈ చిత్రానికి ఆయా రంగాలలో నిష్ణాతులయిన ప్రముఖులు అంత కలిసి పనిచేస్తున్నారు . వి.కె. ప్రకాష్ దర్శకత్వం వహించిగా , నిత్య మీనన్ నటిస్తున్న ఈ చిత్రంలో ,సినిమా మొత్తంలో వొకే వొక ముఖ్యమయిన పాత్ర ఉన్నట్టుగా సమాచారం .
ఈ సినిమా కథ వొక మహిళా ఇంగ్లీష్ రచయిత జీవితంలో ఎదురయినా సంఘటనల పై ఆధారపడుతుంది. సమకాలీన సమాజంలో జరుగుతున్న అన్యాయంతో మరియు పెరుగుతున్న అసహనానికి సంబంచించి ఈ చిత్రం లో కొన్ని సన్నివేశాలు ఉన్నాయి . వొక అద్భుతమైన దృశ్య సృష్టించే నైపుణ్యం గల వి. కె. ప్రకాష్ మరియు పి సి శ్రీరామ్ ఈ సినిమాకి పనిచేయగా రెసుల్ పూకుటీ మరియు లూయిస్ ప్లాంక్ ఈ చిత్రానికి సౌండ్ ఇంజినీర్లగా పనిచేస్తున్నారు . సరౌండ్ సౌండ్ సింక్ సిస్టం తో వస్తున్న భారతదేశంలో మొదటి చిత్రం . బాలీవుడ్ చిత్రంలో తొలిసారిగా నటిస్తున్న నిత్య మీనన్ "ప్రాణ" ద్వారా అన్ని ప్రాంతాల ప్రేక్షకులను అలరించబోతోంది. సురేష్ రాజ్, ప్రవీణ్ ఎస్ కుమార్ మరియు అనితా రాజ్ లు ఎస్ రాజ్ ప్రొడక్షన్స్ మరియు రియల్ స్టూడియో పతాకంపై నిర్మించారు.


ఎప్పుడో జులై లో ఫస్ట్ లుక్ పోస్టర్ ని విడుదల చెయ్యుగా మంచి స్పందన వచ్చింది . తాజా గా ఈ సినిమా " ప్రమోషన్ అంటూ వర్కింగ్ స్టిల్ వొకటి " ట్వీట్ చేసి సినిమా రాబోతుంది అనే సంకేతాలు ఇచ్చారు .