హ్యాపీ బర్త్ డే రాణా

SMTV Desk 2018-12-14 14:27:15  rana daggupati,rana,ntr biopic, bahubali, ghazi

హైదరాబాద్ , డిసెంబర్ 14:
మూవీ మొఘల్ రామా నాయుడు గారి మనవడిగా తెలుగు చిత్ర సీమలోకి అడుగుపెట్టినా తనదైన టాలెంతో ఎదిగిన దగ్గుపాటి రాణా . 2010 లో రానా మొదటి చిత్రం తెలుగులో, శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించినది, ఇది అతని అతి పెద్ద విజయాలలో వొకటి. రాణా "దమ్ మారో దం " సినిమా తో తన బాలీవుడ్ ప్రవేశం చేసాడు .టైమ్స్ ఆఫ్ ఇండియా కాంటెస్ట్ లో అతను "ది మోస్ట్ ప్రోమిసింగ్ న్యూకొమ్మర్ ఆఫ్ 2011" గా ఎంపికయ్యాడు. 2011 సంవత్సరానికి అతను టైమ్స్ ఆఫ్ ఇండియాస్ "మోస్ట్ డెసైరబుల్ మాన్ అఫ్ ఇండియా" గా 20 వ స్థానంలో నిలిచి 2012 లో 10 వ "మోస్ట్ డెసైరబుల్ మాన్ అఫ్ ఇండియా" గా ఎన్నికయ్యారు.

తెలుగు సినిమా గవురవాన్ని పెంచిన బాహుబలి లాంటి సినిమాలో ఆయన నటనకు మంచి మార్కులు పడ్డాయి, అలాంటి భారీ బడ్జెట్ లే కాక తక్కువ బడ్జెట్ లో " ఘాజి " లాంటి ప్రయోగాత్మకమయిన సినిమాలో కూడా నటించి విజయం సాధించాడు .

దగ్గుపాటి రాణా ప్రస్తుతం తెలుగులో " యన్ .టి .ఆర్ బయోపిక్ "లో రాజకీయ దురంధరుడు చంద్రబాబు నాయుడు పాత్రలో కినిపించబోతున్నాడు హిందీలో హౌస్ ఫుల్ సినిమా, తమిళంలో " ఎన్నై నోకి పాయుమ్ తోట " ఇలా , వొక తెలుగునటుడిగా వివిధ బాషలలో సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు . ఈ రోజు అతని పుట్టిన రోజు సందర్భంగా "యన్ .టి .ఆర్" సినిమా నుండి వొక పోస్టర్ ని విడుదల చేసారు .
కాగా అందరు రాణాకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు .