భారత్, శ్రీలంక మొదటి టెస్టు మ్యాచ్

SMTV Desk 2017-07-26 12:56:10  india ,vs, srilanka, test, match, 2017

శ్రీలంక, జూలై 26 : భారత్, శ్రీలంక పర్యటనలో భాగంగా ఈ రోజు మొదటి టెస్టు ప్రారంభమైంది. ముందుగా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇండియా లంచ్ సమయానికి ఒక వికెట్ నష్టపోయి 115 పరుగులు చేసింది. అభినవ్ ముకుంద్ 26 బంతుల్లో 12 పరుగులు చేసి అవుటయ్యాడు. ప్రస్తుతం శిఖర్ ధావన్ 82 బంతుల్లో 64 పరుగులు, పుజారా 59 బంతుల్లో 38 పరుగులతో క్రీజ్ లో ఉన్నారు. హార్దిక్ పాండ్య ఈ మ్యాచ్ తో మొదటి సారి టెస్టు మ్యాచ్ ఆడుతున్నారు.