తెరాస వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్.!

SMTV Desk 2018-12-14 11:27:03  KCR, KTR, TRS Working president

హైదరాబాద్‌, డిసెంబర్ 14: తెలంగాణ తాజా ముఖ్యమంత్రి, తెరాస అధినేత కేసీఆర్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి యువనేత కే తారకరామారావును పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షునిగా ప్రకటించారు కేసీఆర్. ఇప్పటివరకూ కార్యనిర్వాహక అధ్యక్ష పదవి తెరాస పార్టీలో లేదు. అత్యంత నమ్మకస్తుడు, సమర్దుడికే పార్టీ బాధ్యతలను అప్పగించానని కెసిఆర్ అన్నారు. జాతీయ రాజకీయాల్లో కేసీఆర్‌ క్రియాశీల పాత్ర పోషించాలన్న ఆలోచనతోనే కేటీఆర్‌ను వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా నియమించినట్లు సమాచారం.


ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కేటీఆర్‌ అత్యంత కీలకంగా వ్యవహరించారు, అభ్యర్థులు అందరినీ ఏకతాటిపైకి తేవడంలో విజయవంతమయ్యారు. అలాగే‌ గత ప్రభుత్వంలో తనకు అప్పగించిన మంత్రిత్వ శాఖలను కూడా ఆయన సమర్థంగా నిర్వహించారు. దీంతో రాష్ట్ర రాజకీయాలు, పాలనా వ్యవహారాలకు సంబంధించి కేటీఆర్‌ అత్యంత క్రియాశీలంగా వ్యవహరించే అవకాశం ఉంది.