శర్వానంద్ సినిమా ట్రైలర్ కూడా వచ్చేస్తుంది

SMTV Desk 2018-12-13 15:54:48  sarwanand, sai pallavi, hanu raghavapudi, pradeep chukkapalli, sudhakar cherukuri,padi padi lechina manasu, padi padi lechina manasu rating.

హైదరాబాద్ డిసెంబర్ 13: హనురాఘవపూడి దర్శకత్వం లో శర్వానంద్ , సాయి పల్లవి జంటగా రొమాంటిక్ లవ్ స్టోరీగా తెరకెక్కుతున్న చిత్రం " పడి పడి లేచె మనసు ". ఈ నెల 21 న విడుదలకు సిద్దమవుతున్న ఈ చిత్రానికి విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్నారు .ఈ చిత్రాన్ని శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర బ్యానర్ లో ప్రదీప్ చుక్కపల్లి , సుధాకర్ చెరుకూరి లు నిర్మాతలు గా వ్యవహరిస్తున్నారు.

ఈ నేపథ్యంలో రేపు ఉదయం 11గంటలకు ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేయనున్నారు. ట్రైలర్ తో మరింతగా అంచనాలు పెంచే పనిలో దర్శకుడు హను వున్నాడు.

సాధారణంగా కథ లో కొత్తదనం లేకపోతే అటు శర్వానంద్ గానీ .. ఇటు సాయిపల్లవి గాని ఓకే చెయ్యరు . అలాంటిది ఈ ఇద్దరూ కలిసి చేస్తున్నారంటే కథ లో విషయం ఉంటదని సినీ విశ్లేషకులు అనుకుంటున్నారు. శర్వానంద్ కి సాయిపల్లవికి గత చిత్రాలు విజయం సాధించాయి ఇదేమయ్యిదో చూడాలి.