హ్యాపీ బర్త్ డే 'విక్టరీ వెంకీ'

SMTV Desk 2018-12-13 14:24:30  victory venky,venkatesh,daggupati venkatesh,suresh productions

హైదరాబాద్, డిసెంబర్ 13 : ఆయన నవ్విస్తాడు, ఏడ్పిస్తాడు , అన్నిట్లో ఉంటాడు, వివాదాలకు దూరంగా , సినీ ప్రేక్షకులకి దగ్గరగా విజయమున్న గర్వం రాకుండా, ఓటమున్న భాద లేకుండా సాగుతున్న " పెద్దోడు " మన దగ్గుపాటి వెంకటేష్ బాబు అలియాస్ "విక్టరీ వెంకీ" . హీరోగా కలియుగ పాండవులతో మొదలుపెట్టి మొదటి సినిమాతోనే నంది అవార్డు ని గెలుచుకున్న నటుడు , అక్కడితో ఆగకుండా ఇప్పటివరకు ఆయన సినిమా జీవితంలో 6 నందులను గెలుచుకున్నాడు .

చరిత్ర సృష్టించిన ఎందరో మహానుభావులను పరిచయం చేసిన సురేష్ ప్రొడక్షన్స్ అధినేత మూవీ మొఘల్ రామా నాయుడు గారి వారసునిగా వచ్చిన వెంకటేష్ గారు వొక నటుడి గా ఆయన తొలినాళ్లలోనే కె. విశ్వనాధ్ వంటి గొప్ప దర్శకుని దర్శకత్వంలో "స్వర్ణ కమలం " వంటి చిత్రంలో నటించి మెప్పించాడు . అప్పట్లో బొబ్బిలి రాజా,కూలీ నెం 1,చంటి, సుందర ఖండ ఇలా చెప్పుకుంటూ పోతే చాల విబ్బినమయినా , విలక్షణమయిన ఆయన చిత్రాలు సలక్షణమయిన విజయాలు సాధించి వెంకటేష్ బాబు ని "విక్టరీ వెంకటేష్" గా నిలబెట్టాయి .

57ఏళ్ళ వయసున్న ఈయన 1960 డిసెంబర్ 13 న ప్రకాశం జిల్లా కారంచేడులో దగ్గుపాటి రామా నాయుడు రాజేశ్వరి దంపతులకి జన్మించాడు. ఇప్పటికీ కుర్ర హీరోలతో పోటీపడే అందం, ఫిట్నెస్ ఆయన సొంతం .నటన కోసం తన పాత్ర తగ్గుతోందని తెలిసినా అహం భావానికి పోకుండా నటించడం ,నటన పట్ల ఆయనకున్న ఇష్టాన్ని తెలియజేస్తుంది .

నువ్వు నాకు నచ్చావ్ ,కలిసుందాం రా , ప్రేమంటే ఇదే రా , ప్రేమించుకుందాం రా , వసంతం, సంక్రాంతి, ఆడవారి మాటలకు అర్దాలే వేరులే, తులసి ,దృశ్యం, గురు మొదలయినవి ఆయన సాధించిన విజయాలలో చెప్పుకోదగినవి .

నేడు మన విక్టరీ వెంకీ గారి జన్మదినం , మున్ముముందు మరిన్ని విజయాలు సాధించాలని అందరు ఆయనని విష్ చేస్తున్నారు. ఈ సంక్రాంతికి మనముందుకు మెగా హీరో వరుణ్ తేజ్ తో కలిసి "ఎఫ్ 2 " తో వస్తున్నాడు , ఇప్పటికే ఈ సినిమా టీజర్ విదులయింది .