'ఫసక్' టైటిల్ తో మంచువారి సినిమా

SMTV Desk 2018-12-13 13:26:56  mohan babu,fasak,fassak,manchu vishnu

హైదరాబాద్ డిసెంబర్ 13: ఈ మధ్య "ఫసక్ " ఈ మాట వింటేనే మనకి తెలియకుండానే నవ్వొచ్చేస్తుంది, అంతలా పాపులర్ అయింది ఈ పదం. అసలు ఇది ఎక్కడ నుండి వచ్చిందంటే ఆ మధ్య వొక నేషనల్ మీడియా ఇంటర్వ్యూలో మోహన్ బాబు మాట్లాడుతూ, వొక సీన్ ని ఇంగ్లీష్ లో చెప్పడానికి ఫసక్ అనే పదం వాడారు . ఏ ముహూర్తాన వాడారో తెలీదు కానీ ట్రోల్ పేజీలు ఈ పదం తో వొక ఆట ఆడుకున్నాయ్ , సోషల్ మీడియా దాటి జనాలు వాడేంతగా పాపులర్ ఐయింది ఈ పదం .ఇంతగా పాప్యులర్ అయిన ఫసక్ ఇప్పుడు సినిమా టైటిల్ గా మారుతోంది.

మంచు విష్ణు తన సొంత బ్యానర్ అయిన 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పై వొక సినిమాను నిర్మించడానికి సిద్ధమవుతున్నాడు. ఈ సినిమా కోసం ఫసక్ అనే టైటిల్ ను రిజిస్టర్ చేయించినట్టుగా తెలుస్తోంది ఆయన . ఈ సినిమాకి దర్శకుడు ఎవరు? కథానాయకుడిగా విష్ణు చేస్తాడా .. నిర్మాతగా మాత్రమే వ్యవహరిస్తాడా? అనే విషయంలో క్లారిటీ ఇంకా క్లారిటీ లేదు . ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే తెలిసే అవకాశం వుంది.