తండ్రిపై కేసు పెట్టిన ఎల్.కే.జీ చిన్నారి..!

SMTV Desk 2018-12-13 12:01:29  Tamilanadu, Children doing police case about her father

తమిళనాడు, డిసెంబర్ 13: చిన్నపిల్లలు దేవుళ్లకు ప్రతిరూపం అంటారు. ఎటువంటి కల్మషం, ద్వేషం లేకుండా ఉన్నది ఉన్నట్లు చెప్పడమే అందుకు కారణం. తాజాగా తమిళనాడులో ఓ చిన్నారి తండ్రిపైనే పోలీసులకు ఫిర్యాదు చేసింది, ఎన్నిసార్లు చెప్పినా ఇంట్లో మరుగుదొడ్డి కట్టడం లేదని వాపోయింది. తమిళనాడు రాజపురం వినాయక వీధిలో ఓ కుటుంబానికి చెందిన హనిఫా (7) ఎల్.కే.జీ చదువుతోంది. తన ఇంట్లో మరుగుదొడ్డి లేకపోవడంతో ఆమె కాలకృత్యాల కోసం బయటకు వెళ్లాల్సి వచ్చేది. ఇంట్లో మరుగుదొడ్డి కట్టించాలని తండ్రి ఇసానుల్లాను పలుమార్లు కోరింది. అయిన తండ్రి పట్టించుకోపోవడంతో బాలిక..చివరికి బంధువుల సాయంతో ఆంబూరులోని మహిళా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది.


బాలిక మాటలు విని ఆశ్చర్యపోయిన పోలీస్ అధికారులు.. విషయాన్ని జిల్లా కలెక్టర్ రామన్‌కు తెలియజేశారు. దీంతో కలెక్టర్ ఆదేశాల మేరకు రంగంలోకి దిగిన మున్సిపాలిటి అధికారులు స్వచ్ఛ భారత్ పథకం కింద మరుగుదొడ్డి పనులను ప్రారంభించారు. మరుగుదొడ్డి నిర్మాణానికి చొరవ చూపిన ఆ చిన్నారిని అధికారులు అభినందించారు.