'ఒడియన్' సినిమా కీ అదిరిపోయే ప్రీ రిలీజ్ బిజినెస్

SMTV Desk 2018-12-12 18:22:38  mohanlal,laletta,odiyan,shirkumaran,malluwood

హైదరాబాద్ ,డిసెంబర్ 12 :
శ్రీకుమార్ మీనన్ దర్శకత్వం లో మలయాళ హీరో కంప్లీట్ ఆక్టర్ మోహన్ లాల్ కథానాయకుడిగా వొడియన్ నిర్మితమైంది. ఈ నెల 14వ తేదీన వొడియన్ ను మలయాళంతో పాటు తెలుగు,తమిళ భాషల్లో విడుదల చేయనున్నారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ 100 కోట్లచేయడం విశేషం. మలయాళంలో ఈ స్థాయి బిజినెస్ చేసిన మొదటి సినిమా ఇదే. ఈ విషయాన్ని దర్శకుడు శ్రీకుమార్ మీనన్ తన ట్విట్టర్ ద్వారా తెలియజేశాడు.



కథానాయికగా మంజు వారియర్ నటిస్తుతున్న ఈ సినిమా కథ గ్రామీణ నేపథ్యంలో కొనసాగుతుంది. ఈ సినిమాలో మోహన్ లాల్ డిఫరెంట్ లుక్స్ తో , సూపర్ పవర్స్ కలిగిన యోధుడిగా కనిపించనున్నారు. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన పోస్టర్స్ కి ట్రైలర్ కి అనూహ్యమైన రెస్పాన్స్ వచ్చింది. అందువలన ఈ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకోవడం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.