మరొక పెద్ద బ్యానర్ లో విజయ్ సినిమా

SMTV Desk 2018-12-12 17:40:28  vijay devarakonda,dear comrade,mythri movies

హైదరాబాద్ ,డిసెంబర్ 12 :
విజయ్ దేవరకొండ కి రోజు రోజు కీ యువతలో మంచి అభిమానం ఏర్పడుతుంది ఈ మధ్య కలం లో ఆయన సినిమాలకి జనం ఎగబడి చూస్తున్నారు . దాంతో ఈ క్రేజ్ కారణంగా ఆయనతో సినిమాలు చేయడానికి దర్శక నిర్మాతలు పోటీపడుతున్నారు. ప్రస్తుతం ఆయన డియర్ కామ్రేడ్ సినిమా షూటింగుతో బిజీగా వున్నాడు. ఆ తరువాత సినిమాకి పెద్ద పెద్ద బ్యానర్లు ఆయన కోసం ప్రయత్నాలు చేస్తున్నాయి.

అయితే మైత్రీ మూవీస్ బ్యానర్ లో సినిమా చెయ్యడాని విజయ్ దేవరకొండ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది . ఈ సినిమాకి హీరో అనే టైటిల్ ను కూడా ఫిక్స్ చేశారని సమాచారం. గతంలో చిరంజీవి కథానాయకుడిగా, ఆ తరువాత నితిన్ కథనాయకుడిగా రెండు సినిమా లు హీరో టైటిల్ తోనే వచ్చాయి . ఆ చిరంజీవి సినిమా అప్పట్లో పర్లేదనిపించినా , నితిన్ సినిమా తుస్సుమంది. విజయ్ దేవరకొండకి ఎలాంటి విజయం దక్కుడో చూడాలి.