నేడు రజిని కాంత్ జన్మదినం సందర్భంగా పలువురి శుభాకాంక్షలు

SMTV Desk 2018-12-12 14:10:06  Rajini Kanth ,Petta,Super star,tamil

చెన్నై ,డిసెంబర్ 12 : సూపర్ స్టార్ రజినీకాంత్ ఈరోజు తన 68వ పుట్టినరోజు సందర్భంగా ఎంతో మంది సినీ ప్రముఖులు ట్విట్టర్ ద్వారా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. రజినీకాంత్ పుట్టిన రోజు సందర్భంగా అభిమానులు ఎన్నో సేవ సవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

రజినీకాంత్ బెంగళూరు లోని మరాఠి కుటుంబంలో డిసెంబర్ 12 1950, జన్మించారు. ఆయన తండ్రి వొక సామాన్య కానిస్టేబుల్ . రజినీకాంత్ అసలు రేపు శివాజి రావు గైక్వాడ్ . రాజ్ బహదూర్ అనే మిత్రుడి ప్రోత్సాహం తో మాములు బస్సు కండక్టర్ స్థాయినుండి ఇప్పుడు భారత దేశ అభిమాన నటుడిగా అందరి ప్రశంశలు పొందుతూన్నారు.

రజినీకాంత్లోని ప్రతిభను తొలిగా గుర్తించింది ప్రఖ్యాత దర్శకుడు బాల చందర్. రజినీకాంత్ మొదటి సినిమాగా కమల్ హాసన్ హీరోగా నటించిన "అపూర్వ రాగంగళ్" అనే తమిళ చిత్రంలో సహాయ నటుడిగా నటించారు, తర్వాత కన్నడ చిత్రంలో నటించారు. ఆవిధంగా ఎన్నో చిత్రాలలో చిన్న పాత్రలు వేసి 1977 లో విడుదలయిన " చిలకమ్మా చెప్పింది అనే " తెలుగు సినిమాతో హీరోగా మారారు . కానీ ఆ తరువాత కూడా ఎన్నో సాదాసీదా ప్రతినాయక పాత్రలు గొప్పగొప్ప నటుల సినిమాలలో చేసి నటనను వదిలేద్దామనుకున్న తరుణంలో 1980 లో హిందీ " డాన్ " కి రీమేక్ గా వస్తున్న "బిల్లా " సినిమా లో అవకాశం వచ్చింది. ఆ సినిమా విడుదల తరువాత " రజిని కాంత్ " వొక పూర్తి స్థాయి కథనాయకునిగా గుర్తిచారు . 1990 లలో వచ్చిన బాషా, అరుణాచలం, నరసింహ సినిమాలు ఆయన కెరీర్ లో మైలు రాళ్లుగా నిలిచాయి. తర్వాత ఎన్నో తమిళ, హిందీ, తెలుగు సినిమాలలో నటించి ప్రజల మన్ననలు పొందారు. గత సంవత్సరం రజినీకాంత్ మక్కల్ మండ్రమ్ అనే రాజకీయ పార్టీని స్థాపించారు.

ఇటీవల విడుదలయిన రోబో 2.ఓ కలెక్షన్ ల సునామి సృష్టిస్తుంది . వయసు 68 ఏళ్ళు కానీ మనిషి అలకన్పడదు ఈ రోజు విడుదలయిన పెట్టా టీజర్ చూస్తే అర్ధమవ్వుది . సూపర్ స్టార్ రజిని కాంత్ సినిమా లో ఎంత స్టైల్ గా ఉన్నా నిజ జీవితం లో చాలా సాదాసీదాగా ఉండడం అయన ప్రత్యేకత .






https://twitter.com/VishalKOfficial/status/1072776339462094853